ఉదయగిరి: కూలిపనులు చేసుకుని బిడ్డను చదించానయ్యా సీఎం చంద్రబాబుతో వింజమూరు మండలానికి చెందిన గోళ్ళ రమేష్ తండ్రి కన్నీరు
కర్నూల్ బస్సు దహనం దుర్ఘటనలో మరణించిన వింజమూరు మండలం గొల్లవారిపల్లి చెందిన గోళ్ళ రమేష్ తండ్రిని సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. కూలీ పనిచేసుకుని కొడుకుని చదించామని , ప్రయోజకుడు అయ్యాడని సంతోషించే లోపల ఇలా జరిగినదని కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పటికీ అతడు కూలి పనులకు పోతున్నాడు. ఎమ్మెల్యే సురేష్ ఉదయంనుంచి తమదగ్గరే ఉన్నాడని చెప్పాడు. ఈ దుర్ఘటనలో సురేష్ , అతడి భార్య , ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు.