భీమిలి: ఉపాధ్యాయ ఉద్యోగులకు పాత బకాయిలు చెల్లించాలి : జిల్లా టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
ఆనందపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి .కేశవరావు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన పాత బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మరి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి డి ఏ ఏరియాస్ ఈ ఎల్ ఎస్ పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెరుగైన పిఆర్సి తో పాటు పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఉపాధ్యాయుల్లో నిరాశ కలిగిందని ఉద్యోగులు న్యాయబద్ధమైన హక్కులను వాయిదా వేసారన్నారు.