కొల్లేరు ప్రజల సమస్యలను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కొల్లేరు ప్రజల సమస్యలపై జిల్లాకు చెందిన రాష్ట్ర గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో శనివారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఇంచార్జ్ మంత్రివర్యుల ఛాంబర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.