సత్తుపల్లి: పట్టణంలోని పారిశుద్ధ్య లోపంపై మునిసిపల్ కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు చేశారు.ఈ క్రమంలో పట్టణంలో పారిశుద్ధ్య లోపంపై మున్సిపల్ కమిషనర్ రవిబాబు పై మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్ అండ్ బి రోడ్డు పక్కన కొబ్బరి బోండాలు,చెత్తాచెదారం పారపోసి ఉండటం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్ అండ్ బి రోడ్డు పక్కన కొబ్బరి బోండాలు,చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోకపోగా వారిపైనే కేసులు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు.మరో మూడు రోజుల్లో పండక్కి వస్తానని ఆలోగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ను ఆదేశించారు