మేడిపల్లి: మండల కేంద్రంలో పాటలతో ఆకట్టుకుంటున్న గంగాధర్ అనే అంధుడు, "బలగం" పాటతో సోషల్ మీడియాలో వైరల్
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ ని అంధుడు కళ్ళు లేకపోయినప్పటికీ తన గాత్రంతో పలువురుని ఆకట్టుకుంటున్నాడు గంగాధర్ అన్న, రవి ఇద్దరు కలిసి "అయ్యో రామ రామ బాలి "పాట పాడి చాలా ఫేమస్ అయ్యారు, కొండగట్టు ప్రాంతంలో పాటలు పాడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, పుట్టుకతో కళ్ళు లేకపోయినప్పటికీ భక్తి, జానపద సినిమా పాటలను పాడుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాడు, అన్ని అవయవాలు సరిగా ఉండి సోమరుల తిరుగుతున్న ఈ రోజుల్లో కుటుంబం కోసం కళ్ళు లేకపోయినా పాటల పాడుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు యువకుడు.