పాడేరులో రెండు రోజులపాటు నిర్వహించే జిల్లాస్థాయి డిఆర్పిల శిక్షణ కార్యక్రమమున ప్రారంభించిన డీఈఓ బ్రహ్మజీరావు
అల్లూరి జిల్లా పాడేరు లో రెండు రోజులు పాటు జిల్లాస్థాయిలో డీఆర్పీలకు నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంబించారు. ఈ సందర్బంగా డీఈవో బ్రహ్మాజీరావు మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన బేస్ లైన్ టెస్ట్ గ్రేడ్ ఆదారంగా విద్యార్థులు అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి జిల్లాలో ఉపాద్యాయులందరికి శిక్షణ ఇచ్చే నిమిత్తం జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రకారం జిల్లా స్థాయిలో డీఆర్పీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరగుతుందని అన్నారు.