మేడ్చల్: మేడ్చల్ జిల్లా హోలీ మేరీ కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం
మేడ్చల్ జిల్లా బోగారంలోని హోలీ మేరీ కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ విజయ శారద రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు వివిధ రుచికర వంటకాలతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.