మేడ్చల్: అల్లాపూర్ డివిజన్ లో ముస్లిం గ్రేవ్ యార్డు ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసఫ్ నగర్ లో ఆదివారం నూతన ముస్లిం గ్రేవ్ యార్డ్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అలాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ కాలనీలో ముస్లిం మైనార్టీ పెద్దల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్లో ముస్లిం సమాజం కోసం ప్రత్యేకంగా కొత్త గ్రేవియార్డును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.