జమ్మలమడుగు: జమ్మలమడుగు : పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరాహార దీక్ష
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపో వద్ద గురువారం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీఎస్ఆర్టీసీ కడప డి పి టి ఓ మొండి వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పిలుపు మేరకు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కడప రీజినల్ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని కడప డిప్యూటీఓని గత ఆరు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్న పరిష్కారం చేయలేదని తెలిపారు.