కుక్కునూరు మండలంలో సాయుధ దళాలతో కవాతు నిర్వహించిన పోలీసులు
Eluru, Eluru | Mar 29, 2024 ఎస్పీ మేరీ ప్రశాంతి, పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం కుక్కునూరు సిఐ శ్రీనివాసరావు, కుక్కునూరు ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది మరియు సాయుధ దళాలతో కలిసి కుక్కునూరు మండలంలోని వేలేరు, వెంకటాపురం, బంజారాగూడెం, ఉప్పేరు, చీరవల్లి, వింజరం, మారేడుబాక, కుక్కునూరు గ్రామములలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫుట్ పెట్రోలింగ్‌ను నిర్వహించారు. ఎన్నికలలో ప్రజలు పాటించవలసిన విధి విధానాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.