ఆందోల్: జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఉచిత సంగీత నృత్య శిక్షణ శిబిరం ప్రారంభం
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని చోటాకూర్ మండలం పసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఉచిత వాయిద్య సంగీత నృత్య శిక్షణ శిబిరం ఆదివారం నాడు ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు ప్రతి విద్యార్థి శాస్త్రీయ సంగీతం నృత్యం నేర్చుకోవాలని ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేంద్ర శర్మ సిద్ధాంతి తెలిపారు.