పత్తికొండ: వెల్దుర్తి మండలం లో రామచంద్రుడు అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య
వెల్దుర్తి మండలం కొసనపల్లి గ్రామానికి చెందిన రైతు కురువ రామచంద్రుడు (35) పంట నష్టాలు, అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక పురుగులమందు తాగాడు. 1.5 ఎకరాల్లో సాగు చేసిన ఉల్లి పంటకు తక్కువ ధర రావడంతో మనస్తాపానికి గురయ్యాడు. గతేడాది మిరప పంటలోనూ నష్టపోయినట్టు తెలిసింది. సెప్టెంబరు 11న ఆత్మహత్యాయత్నం చేసిన అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు.