శ్రీకాకుళం: ఉర్జాం గ్రామంలో పొలం పనులు చేస్తుండగా పిడుగు పడి ఓ మహిళ మృతి
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఉర్జాం గ్రామానికి చెందిన కనితి పార్వతి మంగళవారంసాయంత్రం 4 గంటలకు పొలంలో పనులు చేస్తుండగా... ఒక్కసారిగా వాతావరణం మారి ఆమె సమీపంలో పిడుగు పడడంతో ఒకసారి ఆమె కుప్ప కూలింది. గమనించిన తోటి కూలీలు.. ఆమె కు సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఘటనపై పోలాకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.