అదిలాబాద్ అర్బన్: సీపీఐ మావల మండల శాఖ ఆధ్వర్యంలోతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 77 వార్షికోత్సవాన్ని సీపీఐ మావల మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర సమితి సభ్యుడు మడుపు నలిని రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాటం పలు ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.