మోపిదేవిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
Machilipatnam South, Krishna | Sep 25, 2025
మోపిదేవి లో ఉత్తర చిరువోలులంక గ్రామానికి చెందిన నడకదుటి నాగమల్లేశ్వరరావు (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దేవస్థానంలో పనిచేస్తున్న ఆయనకు కాలి నుండి అకస్మాత్తుగా రక్తం కారడంతో సహోద్యోగులు గమనించి ఆవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వారి ఆరోపణల మేరకు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.