రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
Anantapur Urban, Anantapur | Nov 4, 2025
రెండు నెలల క్రితం అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంకటరాముడు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు మృతి పై అనుమానం ఉందని తమకు పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.