రాయదుర్గం: పట్టణంలోని కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం
అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవాన్ని రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వృక్ష, రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఓజోన్ పొరను సంరక్షించే బాధ్యత ప్రతి పౌర స్వీకరించాలని సూచించారు. సౌకర్యాల మాటున ప్రకృతికి అసౌకర్యం కలిగించే పనులు మానవుడు చేస్తున్నాడన్నారు. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్స్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతున్న కారణంగా భూమిని కాపాడే ఓజోన్ పొర కూడా దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాసులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.