దర్శి: దర్శి సర్కిల్ పరిధిలో బాణాసంచా దుకాణదారులకు పలు సూచనలు చేసిన సీఐ రామారావు
Darsi, Prakasam | Oct 18, 2025 ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని దీపావళి దుకాణదారులకు సిఐ రామారావు పలు సూచనలు చేశారు. పోలీసు వారి అనుమతి లేకుండా దీపావళి మందుల అమ్మకాలు నిర్వహించకూడదన్నారు. అంతేకాకుండా తాత్కాలిక బాణాసంచి అమ్మకం దారులు ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో మాత్రమే అమ్మకాలు జరుపుకోవాలని అన్నారు. తగిన నిబంధనల ప్రకారం షాపులు నిర్వహించుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమతి లేకుండా దీపావళి మందులను విక్రయించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.