రంగేపల్లిలో రోడ్డులో నిలిచిన వర్షపు నీరు
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం రంగేపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానికులు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంతల రోడ్డులో నీళ్లు నిలిచి బురదమయంగా మారుతోందని కాలనీవాసులు తెలిపారు. దీంతో రోడ్డులో తిరగడానికి ఎక్కడ జారి పడతామో అని వాహనదారులు, కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎస్సీ కాలనీలో రోడ్డు వేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.