అనంతపురం నగర శివారులోని లోనూరు క్రాస్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నగరానికి చెందిన ప్రదీప్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.