జమ్మలమడుగు: టి.చదిపిరాళ్ల : గ్రామ సమీపంలో అదుపు తప్పి లారీ బోల్తా... తప్పిన ప్రమాదం
కడప జిల్లా కమలాపురం మండలం కడప తాడిపత్రి జాతీయ రహదారిలోని టి.చదివిరాళ్ల గ్రామం సాయిబాబా గుడి దగ్గర సోమవారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడు నుండి ప్రొద్దుటూరులోని కొవ్వూరు ట్రాన్స్పోర్ట్ కు వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్టా పడింది. ఆ సమయంలో అటువైపు ఇటువైపు వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.