స్కూల్ సానిటేషన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా
Eluru Urban, Eluru | Sep 24, 2025
స్కూల్ శానిటేషన్ వర్కర్స్ గత మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ లింగరాజు డిఎన్విడి ప్రసాద్ లు మాట్లాడుతూ పాఠశాలలను మరియు పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుతూ భావి భారత పౌరుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఉండడం సిగ్గుచేటని వారు విమర్శించారు