రేగోడు: పోచారం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
Regode, Medak | Jul 16, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రేగోడు మండలం పోచారం గ్రామ శివారులో బుధవారం నీటి గుంతలో పడి గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రేగోడు ఎస్సై తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసినచో స్థానిక రేగోడు పోలీస్ స్టేషన్ సంప్రదించవలసిందిగా ఎస్ఐ తెలిపారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.