అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం రామన్నపాలెం గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించగా, ఈ ప్రమాదంలో రెండు ఇల్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వీరికి పోలీస్ శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు బియ్యం దుస్తులు పంపిణీ చేసినట్లు ఎస్సై షరీఫ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. రామన్నపాలెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన కారణంగా అప్పయ్యమ్మ, వెంకట్రావు అనే ఇద్దరు ఇల్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఈ రెండు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయని చెప్పారు. వీరికి పోలీస్ శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు బియ్యం దుస్తులు పంపిణీ చేశామని ఎస్సై తెలిపారు.