రాయదుర్గం: పట్టణంలో బాలకృష్ణ వాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ నేతలు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చిరంజీవి పై అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత గౌని ఉపేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే చిరంజీవిపై పరుష పదజాలంతో మాట్లాడినా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాలకృష్ణ మానసిక స్థితి సరిడా లేదని తన ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన బయటపడిన మాట వాస్తవం కాదా అని అన్నారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ పొరాళ్ల గోవిందరాజులు, శివపుత్ర, పాల్గొన్నారు.