పుట్టపర్తిలో రెండవ రోజుకు చేరుకున్న డాక్టర్ల నిరవధిక సమ్మె
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి డిఎంహెచ్వో కార్యాలయం ఎదుట పీహెచ్సీ డాక్టర్లు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకుంది బుధవారం మధ్యాహ్నం డాక్టర్లు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను రాష్ట ప్రభుత్వం తీర్చాలన్నారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు అందించామన్నారు. ప్రభుత్వం దానిని మరవకూడదన్నారు. సంచార చికిత్సకు వెళ్ళినప్పుడు అలవెన్స్ ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందని దానిని నెరవేర్చుకోవాలన్నారు.