ప్రకాశం జిల్లా లో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గురువారం పలు వైద్యశాలల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న పలు భవనాల నిర్మాణ పనులు మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు నూతన భవనాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందన్నారు