డోన్ లో పర్యటించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి
Dhone, Nandyal | Sep 16, 2025 నంద్యాల జిల్లా డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి మంగళవారం పర్యటించారు. కార్య కర్తలు, ముఖ్య నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్జున్ రెడ్డిని పూల బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రామచంద్రుడు, నాయకుడు సోమేశ్ యాదవ్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.