ఆళ్లగడ్డ హైవేపై ఆటోను ఢీ కొట్టిన లారీ: ఆటో డ్రైవర్ శివ మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు,టిట్కో గృహాల్లోకి వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టినట్టు స్థానికులు తెలిపారు, ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివ రెండు కాళ్లు విరగడంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలో మృతి చెందినట్లు తెలిపారు, ఆటోను ఢీ కొట్టి లారీ డ్రైవర్ ఆపకుండా వేగంగా నంద్యాల వెళ్లినట్లు పేర్కొన్నారు, మృతుడిని పోస్టుమార్టం తరలించి సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు