రాపూరు ఎస్ఐ వెంకట రాజేశ్‌ను సస్పెండ్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన
నెల్లూరు జిల్లా,రాపూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..ఇటీవల జరిగిన వినాయకచవితి నిమజ్జనం సమయంలో నవాబుపేటకు చెందిన ఓ దళిత యువకుడి పై రాపూరు యస్.ఐ దురుసుగా ప్రవర్తించినందుకు నిరసనగా తమకు న్యాయంకావాలంటూ యువకుని బందువులు యంఆర్పీఎస్ నాయకుల ఆద్వర్యంలో రోడ్డు పై బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు .పోలీసులు నచ్చ చెప్పడంతో ఆత్మకూరు డి.యస్.పి వేణుగోపాల్ ని కలిసి మాట్లాడారు, విచారణ చేసి న్యాయం చేస్తానని డి.యస్.పి వేణుగోపాల్ బాదితులకు హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని బాదితులు,యంఆర్పీఎస్ నాయకులు డీఎస్పీని కోరారు.