పరిగి: కంకల్ గ్రామ సమీపంలో రహదారిపై దిగబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
రహదారిపై దిగబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని కంకల్ సమీపంలో లాల్ పాడు వెళ్లే రహదారిపై రోడ్డు గుంతల మయంగా ఉండడంతో నిన్న కురిసిన వర్షానికి బుడదమయంగా మారిందని అటు నుండి వెళ్లే వాహనదారులు నిత్యం ఇబ్బందులు గురవుతున్నారని గతంలో పలు వాహనదారులు క్రిందపడి గాయాలపాలు కూడా కావడం జరిగిందని లారీ దిగబడటంతో అటు నుండి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేయాలని స్థానికులు తెలిపారు.