రాష్ట్రంలోని అన్ని సొసైటీలు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణకు చర్యలు భీమడోలు మహాజనసభలో పేర్కొన్న ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని
Eluru Urban, Eluru | Sep 30, 2025
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సొసైటీలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణకు చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు సొసైటీ కార్యాలయం వద్ద మహాజన సభసమావేశం మంగళవారం సాయంత్రం సొసైటీ అధ్యక్షులు గన్ని అధ్యక్షతన నిర్వహించారు. ఈమేరకు గన్ని మాట్లాడుతూ సొసైటీ లావాదేవీలు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, భవిష్యత్ ప్రణాళికలను చర్చించారు. త్రిమ్యాన్ కమిటీ డైరెక్టర్లు రాంబాబు, శ్రీను పాల్గొన్నారు