కలికిరిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఒక మామిడి తోపులో సోమవారం ఉదయం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు ఇందిరమ్మ కాలనీలో ఉండే ముల్లంగి రమేష్ (55) గా గుర్తించారు. అయితే రమేష్ అతిగా మద్యం సేవించి మృతి చెందాడా, లేక పాత కక్షల వల్ల ఎవరైనా ఏమైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.