ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ఆపస్ ద్యేయం: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాలాజీ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ఆపస్ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాలాజీ అన్నారు.పీలేరు మండలం పీలేరు పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ సంఘం జిల్లా స్థాయి సమావేశం ఆదివారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాలాజీ పాల్గొని మాట్లాడుతూ తెలుగు ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఆపస్ ముందుండి సమస్యను పరిష్కరించిందని అన్నారు. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. మండల శాఖలను జిల్లా మొత్తం పూర్తి చేయాలని అన్నారు.