రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన, రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ
నంద్యాల జిల్లా రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకు రాలు అనురాధ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు, పదో తరగతి పరీక్ష కేంద్రానికి చేరుకున్న ఆమె పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర పరిశీలకు రాలు అనురాధ వెల్లడించారు, నిబంధనల మేరకే పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు