ఉప్పల్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు. భరత్ నగర్ బురుజు గలిలో 92 లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆదివారం కార్పొరేటర్ రజిత పరిశీలించారు. పనులలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.