రాయదుర్గం కేటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ మౌనీష్ సుభ తనిఖీ చేశారు. శనివారం మద్యాహ్నం కళాశాలకు చేరుకుని ఎన్సిసికి కల్పించిన సౌకర్యాల గురించి వాకబు చేశారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా.కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళాశాలలో ఎన్సిసి కి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు కమాండింగ్ ఆఫీసర్ కు తెలియజేశారు. అనంతరం ఓ.టి ట్రాక్ ను పరిశీలించి నూతనంగా ఎంపికైన ఎన్సిసి క్యాడేట్లతో మాట్లాడారు. నియమ నిబంధనల గురించి వివరిస్తూ పలు సూచనలు చేశారు. ఎన్సిసి ఇన్చార్జి కే.గోవర్ధన్, అధ్యాపకులు బాబు, వినోద్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్ పాల్గొన్నారు.