నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ ఆంగ్లభారత దినోత్సవం: ప్రిన్సిపాల్ లత
నరసన్నపేట: ఆంగ్ల భాష ప్రపంచ భాషగా వెలుగొందుతుందని నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దాడ లత తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ ఆంగ్ల భాష దినోత్సవాన్ని ఘనంగా విద్యార్థులు నడుమ నిర్వహించారు. ప్రముఖ రచయిత, కవి, వ్యాసకర్త విలియం షేక్స్పియర్ జయంతి పురస్కరించుకొని ఏప్రిల్ 23వ తేదీన ఆంగ్లభాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు.