అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం నిమ్మలపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు వివరాలు 108 సిబ్బంది తెలిపారు. గ్రామంలో ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, మంటలు వ్యాపించడం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఆరు సంవత్సరాల సాయి పల్లవి అనే కూతురు ఉండడంతో తల్లి గాయత్రి వెంటనే వెళ్లి కూతుర్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మంటలు తాకిడికి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, హాస్పటల్ కి తరలించే సమయంలో మృతి చెందినట్లు తెలిపారు.