కొండపి: పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సీఎం చంద్రబాబు హామీలు ఇవ్వబోతున్నారు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి పలు హామీలు ఇవ్వబోతున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పేర్కొన్నారు. కనిగిరి నియోజకవర్గం లో సీఎం చంద్రబాబు ఈనెల 11వ తేదీన పర్యటిస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంత్రి స్వామి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెనుకబడ్డ ఈ ప్రాంతానికి సీఎం చంద్రబాబు పలు హామీలు ఇవ్వబోతున్నారని తెలిపారు. మార్కాపురం జిల్లాగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి తెలిపారు. మీడియాతో మధ్యాహ్నం నాలుగు గంటలకు మంత్రి మాట్లాడారు.