గౌరవ సభను కౌరవ సభ చేశారు : వైయస్సార్సీపి నేత నరేంద్రారెడ్డి
Anantapur Urban, Anantapur | Sep 26, 2025
గౌరవ సభను కాస్త కౌరవసభగ మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని టవర్ క్లాక్ వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించి బాలకృష్ణ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.