నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ తెగిపడిపోవడంతో టీచర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో శ్రావణి, రజిత, దీపిక, ప్రత్యూష, రజిని, నాగ శ్రీ, లక్ష్మీ దుర్గ ఉన్నారు. వీరిలో నలుగురికి కాలు ఫ్యాక్చర్ అయ్యింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మొదటి ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి లిఫ్టు పడినట్లు టీచర్లు తెలిపారు.