పాణ్యం: కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి
పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రంలో సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది వారికి ఘన స్వాగతం పలకగా, అర్చకులు సురేష్ శర్మ, నారాయణ శర్మ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. స్వామివారి మహత్యం తెలుసుకొని ఇక్కడికి వచ్చానని, క్షేత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు.