ప్రకాశం జిల్లా కొండపి మండల కేంద్రంలోని మద్దూలూరు రోడ్డులో కోతముక్క ఆడుతున్న ఐదుగురిని కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.2720, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు.