పూతలపట్టు: 30 గ్రామాలకు వెళ్లే రహదారిలో వంతెన కూలిపోయే పరిస్థితి పరిశీలించిన పూతలపట్టు ఎమ్మెల్యే
పూతలపట్టు మండల కేంద్రం సమీపంలో ప్రవహిస్తున్న భీమా నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన వర్షాల తీవ్రతకు దెబ్బతింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నదిపై నీటి ప్రవాహం పెరగడంతో వంతెన కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా భీమా నది రెండు ఒడ్లలోని సుమారు 30 గ్రామాల ప్రజలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. విషయం తెలుసుకున్న పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ స్వయంగా భీమా నది వంతెన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. భీమా నది వంతెన శాశ్వత నిర్మాణం కోసం త్వరలోనే ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి,