ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల అధ్యక్షుడు రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు జెండా ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు సిపిఐ ఏర్పడ్డ పరిస్థితులను స్మరించారు. పేదలు కార్మికుల మధ్య పోరాడుతూ ప్రభుత్వం నుంచి వారికి అందవలసిన సదుపాయాలను అందేలా సిపిఐ చూస్తుందని భవిష్యత్తులో కూడా ఇలానే పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నాయకులు అన్నారు.