వీరి చలపతి కోసం రూరల్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్న మాజీ మంత్రి కాకాని
డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైసిపి కీలక నేత వీరి చలపతిని నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్లారు. భారీగా వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కి వస్తుండంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ గేట్లు మూసేశారు. వీరి చలపతి తో మాట్లాడేందుకు ఆయన కుటుంబ సభ్యులు వచ్చారాని.. లోపలికి అనుమతించాలంటూ మాజీ మంత్రి కాకాని కోరడంతో.. కొందరిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు..