అనంతపురం నగరంలో గురువారం రాత్రి 8 గంటల నుండి 9:30 గంటల వరకు దాదాపు గంటన్నర పాటు వర్షం కురవడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు రాంనగర్ బ్రిడ్జిపై దాదాపు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయినది. శ్రీ కంఠం సర్కిల్, పాత ఊరు, నడిం వంక, రుద్రంపేట బైపాస్, రాంనగర్ ప్రధాన రహదారులన్నీ మురుగునీరుతో జలమయమయ్యాయి. రోడ్డుపై మురుగు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.