నారాయణ్‌ఖేడ్: ఈదుల్ తండా లో ఇంటి నిర్మాణ బిల్లుకు 5000 లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ , విచారణ చేపట్టిన అధికారులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట మండలంలోని ఈదుల్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లు కోసం ఇంటి ఫోటో తీసేందుకు పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ 5000 రూపాయలు లంచం అడిగినట్లు బాధితురాలు తులసి బాయి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశాల మేరకు హౌసింగ్ పీడీ చలపతిరావు ఈదుల్ తండాలో విచారణ చేపట్టారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందిస్తున్నట్లు తెలిపారు.