అసిఫాబాద్: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. GP కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టడం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.